జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా ముమ్మిడిపేట మండలం మేకవానపల్లి సొసైటీ కార్యాలయ ఆవరణలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
అనంతరం మేకవానపల్లి సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించి, వారి నుంచి పంటలను కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా స్థానిక రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొన్నింటి సుశీల, సొసైటీ కార్యదర్శి జహంగీర్, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
