ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మంగళవారం 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
జైనూర్ తహసీల్దార్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం మధ్య తహసీల్దార్ ఆడబీర్షవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జైనూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొడప ప్రకాశ్ జెండా ఆవిష్కరణ చేపట్టారు.
జైనూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు, సహకార సంఘంలో చైర్మన్ కొడప హన్ను పటేల్, సహకార బ్యాంకులో మేనేజర్ రాజేశ్వర్, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ ఇందిర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అలాగే పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో డీఈ ఫజల్ హక్, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి డాక్టర్ నాగర్‌గొంజ్ అశోక్, పశువైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో గుర్రం ఆనంద్‌రావు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జైనూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో హెచ్‌ఎం పార్వతి, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు, అసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముఖీద్, మాంగ్ సమాజ్ కొమరం భీం జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్, మాజీ వైస్ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్ యాదవ్, రషీద్, జైనూర్ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాశ్, కాంగ్రెస్ యువ నాయకుడు మెస్రం అంబాజీరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
