నంది జాతీయ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

నంది జాతీయ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో కుందుర్తి శివరావుకు అభినందనల వెల్లువ
వైద్య, సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక పురస్కారం
సేవా భావం యువతకు ఆదర్శం అంటూ కితాబు

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాల, విజయవాడలో బయోకెమిస్ట్రీ విభాగం జూనియర్ అనలిస్ట్ కుందుర్తి శివరావు ని సోమవారం ఘనంగా సన్మానించారు. వైద్య రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించినందుకు ఆయనకు ఇటీవల ప్రదానం చేసిన “నంది జాతీయ పురస్కారం–2026” సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్యాపిటల్ అమరావతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 24న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కుందుర్తి శివరావుకి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేశారు.

పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆలపాటి యేడుకొండల రావు , బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డా. శారదాంబ , అధ్యాపకులు, సిబ్బంది కలిసి కుందుర్తి శివరావు గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైద్య రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని, సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, సహచర ఉద్యోగులు పాల్గొని కుందుర్తి శివరావు కి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply