Delhi | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం….

Delhi | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం….

  • మూడు అంతస్తుల భ‌వ‌నంలో చెల‌రేగిన మంట‌లు
  • మొబైల్ ఛార్జర్ల గోడౌన్ దగ్ధం !

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నైరుతి ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని మహిపాల్‌పూర్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల భవనంలో శనివారం రాత్రి ఈ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మొబైల్ ఛార్జర్ల ఫ్యాక్టరీ/గోడౌన్‌లో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లోని ప్లాస్టిక్చ‌, ఎలక్ట్రానిక్ వస్తువుల కారణంగా మంటలు క్షణాల్లోనే భవనంలోని మూడు అంతస్తులకు వేగంగా వ్యాపించాయి.

దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply