June 2026 : జూన్ నెల పెన్షన్ల రెడీ Andhra Prabha News

June 2026 : జూన్ నెల పెన్షన్ల రెడీ Andhra Prabha News
- రూ. 2728 కోట్ల విడుదల
- 62.34 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా
- కొత్తగా 5,606 స్పాజ్ పెన్షన్ల మంజూరు
- జూన్ 1 నుంచే నేరుగా లబ్ధిదారులకు పంపిణీ
( ఆంధ్రప్రభ, అమరావతి )
ఏJune 2026 : పీ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కూటమి ప్రభుత్వం రు.2728.67 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా 5606 స్పాజ్ ( భార్య / భర్త ) పెన్షన్లు మంజూరు కాగా… ఈ లబ్ధిదారులకు రు 2.24 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులు అన్నీ జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలతో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అవ్వాతాతలు, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి తెలిపారు.
