ISI-Terror-Plot | దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర భగ్నం

ISI-Terror-Plot | దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర భగ్నం

ISI-Terror-Plot | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న తొమ్మిది మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దేశంలోని కీలక ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నిందితుల అరెస్టుతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అరెస్టయిన వ్యక్తులకు అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల్లో ఢిల్లీ, ముంబయి, పంజాబ్‌కు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దేశంలోని ప్రముఖ వ్యక్తులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం, ఎలక్ట్రానిక్‌ పరికరాల ఆధారంగా మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply