విద్యుత్ సమస్యలు తలెత్తకుండ చర్యలు…

సిర్పూర్(యు ), ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పంగిడి గ్రామపంచాయతీ సర్పంచ్ ఆత్రం మీరా జాలీ0షా అన్నారు. శనివారం పంగిడి గ్రామపంచాయతీలో విద్యుత్ శాఖ వారిచే మరమ్మతు పనులు చేయించారు అదేవిధంగా విద్యుత్ బల్బుల ఏర్పాటు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈదురుగాల బీభత్వానికి తెగిన విద్యుత్ వైర్లను మరమ్మతు చేస్తున్నామని అన్నారు.

విద్యుత్ సమస్యలు తలితితే సమాచారం అందించాలని సర్పంచ్ ఆత్రం మీరా జాలి0షా తెలిపారు. ప్రజలు ఇంటికి సరిపడే విద్యుత్తును ఉపయోగించుకోవాలని సర్పంచ్ కోరారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగితే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తక్షణమే సమాచారం ఇవ్వాలని సర్పంచ్ ప్రజల కోరారు. పంచాయతీలో విద్యుత్ సమస్యల తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచి పేర్కొన్నారు.

Leave a Reply