Sanitation Crisis : కాపాడండి మహాప్రభో Andhra Prabha Top Story

Sanitation Crisis : కాపాడండి మహాప్రభో Andhra Prabha Top Story

  • కాల్వగట్ల జనం గగ్గోలు
  • రైవస్ లాకుల్లో చెత్త తిష్ట ..
  • ఏలూరు కాల్వలో పిచ్చి అడవి
  • వామ్మో దుర్వాసన.
  • ఇళ్లల్లో పాముల సయ్యాట

(విజయవాడసెంట్రల్, ఆంధ్ర ప్రభ)

నగర సుందరీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే,అందుకు బిన్నంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి.వీఎంసీ, ఇరిగేషన్, మలేరియా శాఖల సమన్వయలోపం కారణంగా నగర సుందరీకరణ గాడి తప్పుతున్నది.ప్రభుత్వ ఏచ్చివ్మెంట్ ప్రక్కదారి పడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ నగర సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉన్న ఏలూరు కాలువ సుందరీకరణ ఒక్కప్పుడు చాలా బాగుండేది.ఇప్పుడు ఆసుందరీకరణ మచ్చుకైనా కనబడటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.స్థానిక25వ డివిజన్ ప్రాంతానికి చెందిన ఏలూరు కాల్వ వెంబడి సంజీవయ్య కాలనీ నుండి కార్మిక పురం,కూర్మయ్య వంతెన, రైవస్ కాలువ వరకు కాల్వ వెంబడి,కాల్వలో దట్టంగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు ఉన్నాయి.తద్వారా కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి విష సర్పాలు, కీటకాలు వస్తున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Sanitation Crisis : జనం అవస్థలే అవస్థలు
.
కాల్వగట్ల ప్రాంత వాసుల అవస్థలు ఎనలేనివి.ఇంటికి చిన్న కొద్దిపాటి రేకుల షెడ్డులు నిర్మించుకొని జీవనం సాగిస్తుంటారు.అక్కడ అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు.గట్టిగా వచ్చే ఎండ, వాన, చలిని కూడా తట్టుకోలేని పరిస్థితి నెలకొంది.

Sanitation Crisis : శానిటేషన్​ అద్వాన్నం

అరండల్ పేట సంజీవయ్య కాలనీ నుండి రైవస్ లాకులు వరకు..
అరండల్ పేట సంజీవయ్య కాలనీ నుండి రైవస్ లాకులు వరకు కాల్వ వెంబడి గడ్డి పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి.శానిటేషన్ అద్వాన్నంగా ఉంది.తద్వారా విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. స్థానిక ప్రజలు పగలు రాత్రి అనే తేడాలేకుండా భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.

Sanitation Crisis : అంబేద్కర్ స్టడీ సెంటర్

రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది విద్యార్థులు అంబేద్కర్ స్టడీ సెంటర్ వద్దకు వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. వారు ఇక్కడే ఉంటూ విద్యను అభ్యసిస్తారు.స్తానపానాలకు వెళ్లే సమయంలో అక్కడ విష సర్పాలు ఉంటే పరిస్థితి ఏంటోనని అర్ధం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Sanitation Crisis : వామ్మో కంపు..

ఏలూరు కాల్వలో దట్టంగా పెరిగిన చెట్లు,పిచ్చిమొక్కలు వలన కాలువ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికి మురుగు నిల్వ ఉండి,దుర్వాసన వెదజల్లుతున్నది.కాల్వలో నీరు పారుదల లేకుండా ఉండటం వలన దుర్వాసన చెప్పలేనంతగా వసున్నదని స్థానికులు వాపోతున్నారు.

Sanitation Crisis : ఇళ్లల్లో పాములాట

ఏలూరు కాల్వ వెంబడి బురదలో విష సర్పాలు నిలయంగా ఉంది. చిన్నపాటి వర్షానికి విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి.గత రెండురోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో విష సర్పాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలతో జీవనం సాగించడం చాలకష్టంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఏలూరు కాలువ సుందరీకరణకు అధికారులు తక్షణమే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply