18points | ఆందోళ‌న‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు

18points | ఆందోళ‌న‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు

18points | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ తుది ఘట్టానికి చేరింది. మే 29న ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ కీల‌క మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. వాతావరణ విభాగం విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం, ముల్లాన్‌పూర్‌లో ఈ రోజు భారీ వర్షం, ఈదురు గాలులతో తుఫాను వచ్చే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు ఇలా ఉండటంతో ఇరు జట్ల మధ్య ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఫైనల్‌కు చేరు అవ‌కాశాలుండ‌వు.

ప్రస్తుత లీగ్ స్థితి ప్రకారం, గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన కారణంగా, మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply