త్యాగం,సేవాభావానికి ప్రతీక బక్రీద్..

త్యాగం,సేవాభావానికి ప్రతీక బక్రీద్..
-సోదరభావం, శాంతి సందేశం ప్రపంచానికి మార్గదర్శకం..
-ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
-సామరస్య సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
విజయవాడ, ఆంధ్రప్రభ
త్యాగం సేవా భావానికి ప్రతీక బక్రీద్ అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ త్యాగం, సేవాభావం, సోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మానవతా విలువలను చాటిచెప్పే ఈ పవిత్ర పర్వదినం సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ పార్లమెంట్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
