మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

  • మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్

చిట్యాల, ఆంధ్రప్రభ: మహిళలు తమ హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ సూచించారు. మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. మహిళల వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నిరోధక చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం చాలా అవసరమని గీత రమేష్ ఈ సందర్భంగా తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ‘పోష్’ (POSH) చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా అధైర్యపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు.

Leave a Reply