మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన వన్ టౌన్ సీఐ రమేష్..

మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన వన్ టౌన్ సీఐ రమేష్..

జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచన

భీమవరం, ఆంధ్రప్రభ : తెలిసీ తెలియని వయసులో వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దని భీమవరం వన్ టౌన్ సీఐ అనిశెట్టి రమేష్ సూచించారు.

భీమవరంలోని ప్రకాశం చౌక్ కూడలిలో బుధవారం రాత్రి ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు.

తనిఖీల సమయంలో కొందరు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ ఇలా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భీమవరం వన్ టౌన్ సీఐ అనిశెట్టి రమేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply