పనిచేయని వీల్ చైర్ ఇబ్బందుల్లో దివ్యాంగులు

పనిచేయని వీల్ చైర్ ఇబ్బందుల్లో దివ్యాంగులు
బాసర (నిర్మల్ జిల్లా) : రాష్ట్రంలో ఆదాయంలో నాలుగో స్థానంలో ఉన్న ఆలయం బాసర పుణ్యక్షేత్రం అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు బాసర క్షేత్రానికి తరలివస్తారు. ఇందులో దివ్యాంగులు సైతం అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు పదుల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధాన ద్వారం వద్ద దివ్యాంగుల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేశారు. దాని చక్రాలు ఊడిపోయి 20 రోజులు పైగా కా వస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు ఇబ్బందులు పడుతూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ఒకే ఒక్క వీల్ చైర్ వుంది. అదికూడా చక్రాలు విరిగిపోవడంతో దానిని తోసుకుంటా వెళ్లలేక పోతున్నారు. అధికారులు స్పందించి నూతనంగా వీల్ చైర్లను అందుబాటులో ఉంచితే దివ్యాంగ భక్తులకు ఉపశమనం కల్గుతుందన్నారు.
