బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అందజేత

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అందజేత

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంధం రాజేశ్వర్ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ పిండి మనోష (అశోక్) స్పందించారు.

బాధిత కుటుంబ సభ్యులు ఎల్‌ఓసి కోసం అభ్యర్థించడంతో సర్పంచ్ వెంటనే కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు. ఆయన తక్షణమే స్పందించి రూ.75 వేల ఎల్‌ఓసిని మంజూరు చేశారు.

సర్పంచ్ పిండి మనోష ద్వారా బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అందజేశారు. సహాయం అందించిన నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply