Problems | థియేటర్ యజమానుల సమస్యలపై వినతి
Problems | థియేటర్ యజమానుల సమస్యలపై వినతి
Problems | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పలువురు సినీ నిర్మాతలు కలిసి థియేటర్ రంగ సమస్యలను వివరించారు. నిర్మాతలు రవి, సతీశ్, నాగవంశీ, సాహు గారపాటి, తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్మాతలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్వహణ వ్యయాలు పెరగడంతో థియేటర్లను కొనసాగించడం కష్టంగా మారిందని తెలిపారు.
మల్టీప్లెక్స్‌లకు అమలు చేస్తున్న విధానాల మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకూ పర్సంటేజీ విధానం అమలు చేయాలని నిర్మాతలు కోరారు. అలాగే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
