SepticTank | ఊపిరాడక ఆరుగురు కార్మికుల మృతి

SepticTank | ఊపిరాడక ఆరుగురు కార్మికుల మృతి
SepticTank | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కలహాండి జిల్లాలోని కరియాఖుంటా గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అధికారుల వివరాల ప్రకారం.. సెప్టిక్ ట్యాంక్‌లో పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా విషవాయువులు వ్యాపించాయి. దీంతో ట్యాంక్‌లో ఉన్న కార్మికులు అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
