విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం..

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం..

రైతుకు భారీ నష్టం

తోషం తాండలో జొన్న పంట, మోటార్ దగ్ధం

గుడిహత్నూర్, మే 23 (ఆంధ్రప్రభ): గుడిహత్నూర్ మండలం తోషం తాండ గ్రామానికి చెందిన రైతు జాదవ్ రవిరాజ్ పొలంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో చేతికొచ్చిన జొన్న పంటతో పాటు పైప్‌లైన్, మోటార్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంతో భారీ నష్టం వాటిల్లడంతో రైతు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

బాధిత రైతును ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని, అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి తగిన పరిహారం అందించాలని గ్రామ సర్పంచ్ జాదవ్ జితేందర్ కోరారు.

Leave a Reply