తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
- జీఎం రాధాకృష్ణ
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ:
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మందమర్రి ఏరియాలో అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలోనిర్వహించాలని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధికారులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలోఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రసాధనకోసంప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలనుస్మరించుకుంటూవేడుకలునిర్వహించాలని సూచించారు. వేడుకలను విజయవంతం చేసేందుకు అధికారులు, ఉద్యోగులు, సింగరేణి కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జీఎం కోరారు.ఏర్పాట్లపై అధికారులకుపలుసూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఎస్ ఓ టు జి ఎం జి.ఎల్. ప్రసాద్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, డీజీఎం పర్సనల్ సి.హెచ్. అశోక్, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సీఎంఓ డాక్టర్ మధుకుమార్, సీనియర్ పర్సనల్ మేనేజర్ సత్యనారాయణతో పాటు మందమర్రి ఏరియాకు చెందిన అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
