బాధిత రైతుల పంటలను పరిశీలించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి

బాధిత రైతుల పంటలను పరిశీలించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ గాదంతో దగ్ధమైన అరటి ఆయిల్ ఫామ్ తోటలను శుక్రవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ సునీల్ కుమార్ పరిశీలించారు.
మండలంలోనిరామచంద్రాపూర్ శివారులో సిరిపురం కుమారస్వామి అరటి తోట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో నాలుగు ఎకరాల అరటి తోటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ,నష్ట శాతాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సునీల్ కుమార్ తెలిపారు.

అలాగే మండలంలోని చల్లగరిగే గ్రామ శివారులో చాడ సమ్మిరెడ్డి , జూకల్ శివారులో కురుమిళ్ళ సత్తయ్య కుమార్, రైతులకు గల ఆయిల్ ఫామ్ తోటలో అగ్నిప్రమాదం లో పూర్తిగా దగ్ధమైందని, నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి , ఆయిల్ పాం ప్రతినిధి సాయి, బాధిత రైతులు పాల్గొన్నారు .

Leave a Reply