పిడుగుపాటుకు మూడు పశువులు బలి

పిడుగుపాటుకు మూడు పశువులు బలి

  • జీవనాధారం కోల్పోయిన రైతు కుటుంబం
  • రూ.2 లక్షల నష్టం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన సమయంలో పిడుగుపడి మూడు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు చెందిన ఈ పశువులు పొలంలో కట్టేసి ఉండగా ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల కోసం వినియోగిస్తున్న కాడెద్దులతో పాటు మొత్తం మూడు పశువులు అక్కడికక్కడే మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ పశువులపైనే ఆధారపడి శేఖర్ కుటుంబం జీవనం సాగిస్తోందని గ్రామస్థులు తెలిపారు. పిడుగుపాటు కారణంగా రైతుకు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఒక్కసారిగా జీవనాధారం కోల్పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply