రాజకీయ విలువలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు

రాజకీయ విలువలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు

-మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య

ఆంధ్రప్రభ, విజయవాడ:

విజయవాడలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. నేర రాజకీయాల నేపథ్యం ఉన్న జగన్‌కు రాజకీయ విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. తండ్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతి రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పందించని జగన్ ఇప్పుడు అభివృద్ధిని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం వ్యవహారాలపై కూడా విమర్శలు చేసిన రామయ్య, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వారిని వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. బెంగళూరు, లండన్ పర్యటనల మధ్య జగన్ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అసలు వైఖరిని గమనిస్తున్నారని, ఇకనైనా అబద్ధాల రాజకీయాలు మానుకోవాలని రామయ్య హితవు పలికారు.

Leave a Reply