ఫీల్డ్ అసిస్టెంట్ భర్తీపై .. గ్రామస్తుల ఫిర్యాదు

ఫీల్డ్ అసిస్టెంట్ భర్తీపై .. గ్రామస్తుల ఫిర్యాదు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ భర్తీపై బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ రాధికకు గురువారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ .. గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గత యేడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.అప్పటి నుండి గ్రామంలో ఉన్న సీనియర్ మేట్ తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరిని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. కానీ బుధవారం రోజు కేసముద్రానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ను భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి చెందిన వారిని కాకుండా,సీనియర్ మేట్ ను కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వేరే వారిని నియమించడం పట్ల గ్రామస్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కేసముద్రానికి చెందిన రాష్ట్ర స్థాయి నాయకుని పైరవీతోనే అతనిని నియమించడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికార పార్టీ నాయకులు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. గ్రామానికి చెందిన అర్హులైన,విద్యావంతులను ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆయన వెంట మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న,మాజీ వార్డు మెంబర్ ఎండి మదార్,బిఆర్ఎస్ నాయకులు వీరు నాయక్,వడ్డేపల్లి మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
