అగ్నిప్రమాదాలపై అవగాహన

అగ్నిప్రమాదాలపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని చౌటుప్పల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బి. శివాజీ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని శ్రీరామ కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం ఫైర్ సిబ్బంది ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బి. శివాజీ మాట్లాడుతూ మార్కెట్లలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఏ విధంగా అదుపు చేయాలి, ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో వ్యాపారులకు ప్రత్యక్షంగా (డెమో ద్వారా) వివరించి చూపారు. మంటలు వ్యాపించినప్పుడు భయాందోళనలకు గురికాకుండా, ఫైర్ ఎక్స్‌స్టింగ్యూషర్లను ఎలా ఉపయోగించాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ దేప రమ్యరాజు, శ్రీరామ కూరగాయల మార్కెట్ చైర్మన్ దేప రాజు ముదిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ జి. నాగేశ్, ఫైర్ మెన్లు డి. దిలీప్, జి. నాగరాజు, ఎ. రాజేష్, వి. పాండు, కూరగాయల మార్కెట్ వ్యాపారులు రషీద్, యాట రాజు, పిల్లలమర్రి చంద్రమౌళి, జగదీష్, పల్చం రాములు, పాశం వెంకటేశం, సత్తమ్మ, జమ్ముల ప్రేమలత, నిమ్మల మల్లేష్, షేక్ మునీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన
