13.2 million | వ్యంగ్య పోస్టులతో వైరల్ అయిన సోషల్ మీడియా పేజ్‌కు బ్రేక్

13.2 million | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలపై యువతలో పెరుగుతున్న అసంతృప్తిని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ X ఖాతాను భారత్‌లో నిలిపివేసింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీల వంటి అంశాలపై సెటైరికల్ పోస్టులతో ఈ ఖాతా తక్కువ సమయంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా యువతలో ఈ పేజీకి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
అకౌంట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 13.2 మిలియన్ల యూజర్లను ఈ పేజీ సొంతం చేసుకుంది. వ్యంగ్య పోస్టులు, మీమ్స్ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలపై విమర్శలు చేయడంతో ఈ ఖాతా వేగంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఖాతా నిలిపివేతపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
