అమరజీవి శ్రీ రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

అమరజీవి శ్రీ రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
మరిపెడ, ఆంధ్రప్రభ:
ఆధునిక భారత సాంకేతిక విప్లవ పితామహుడు, భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించేందుకు టెలికాం, కంప్యూటర్ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ‘డిజిటల్ ఇండియా’కు పునాది వేసిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మున్సిపాలిటీ మాజీ సర్పంచ్ రాంలాల్ నాయక్, సీనియర్ నాయకులు గుండగాని వెంకన్న, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్, మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్, సీనియర్ నాయకుడు సర్వర్ వారితో ,పాటు మరిపెడ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రమేష్ నాయక్, తిరుపతి నాయక్, సురేష్ నాయక్, నీలా లచ్చిరాంనాయక్, కరణ్ సింగ్, బోడ రవి, బానోతు చిన్న, రాములు, మెరుగు రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవికాంత్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ప్రమోద్, రమేష్, బోడ శ్రీను, లక్ష్మణ్, పరశురాములు, పాల్గొన్నారు.
