ఆదర్శంగా నిలిచిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే

ఆదర్శంగా నిలిచిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే

  • బైక్‌పై ‘మీ ఎమ్మెల్యే మీ వద్దకు’

గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ :
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం ప్రత్యేకంగా నిలిచారు.

గుంటూరు 40వ డివిజన్ స్వర్ణాంధ్ర నగర్‌లో నిర్వహించిన “మీ ఎమ్మెల్యే మీ వద్దకు” కార్యక్రమానికి అధికారిక వాహనాన్ని పక్కనపెట్టి స్వయంగా ద్విచక్ర వాహనంపై చేరుకుని ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే సామాన్యుడిలా బైక్‌పై కార్యక్రమానికి రావడం స్థానిక ప్రజలు, పార్టీ నాయకుల్లో ఆసక్తి రేకెత్తించింది.