కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

  • రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
  • రుద్రసముద్రంలో కళ్లద్దాలు మందులు పంపిణీ చేసిన మంత్రి

మక్తల్, ఆంధ్రప్రభ ; కర్ణాటక సరిహద్దున ఉండడమే కాకుండా అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంతంలో పేదరికం కారణంగా కంటి సమస్యలతో బాధపడుతున్న అనేకమందికి తమ వంతుగా సహకారం అందించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.గురువారం నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో వాకిటి శ్రీహరన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శస్త్ర చికిత్స చేసుకున్నవారికి మందులు, కళ్లద్దాలు, పండ్లు బ్రెడ్లు మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ వాకిటి శ్రీహరన్న సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను కంటి సమస్యలు ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే వందలాది మంది కి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందించామని వ్యవస్థాపకులు అల్కూరి రవికుమార్ తెలిపారు.

వైద్యం కోసం మంత్రి వాకిటి శ్రీహరి అహర్నిశలు కృషి చేస్తున్నారని, దసరావరకు 150పడకల ఆసుపత్రి ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. మక్తల్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి కి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగప్ప, ఉప సర్పంచ్ రామ్ లింగప్ప, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, సాలంబిన్ ఉమర్ బస్రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply