కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలి

కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలి

  • అదనపు కలెక్టర్ చంద్రయ్య

జన్నారం, ఆంధ్రప్రభ: వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును, మొర్రిగూడలోని రాఘవేంద్ర రైస్ మిల్లును, చింతగూడ ప్యాక్స్, సెర్ప్ కేంద్రాలను ఆయన బుధవారం మధ్యాహ్నం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యం సేకరణను వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కల్గకుండా కొన్న వడ్ల బస్తాలను త్వరితగతిన తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అనంతరం చింతగూడ గ్రామంలోని ఓ లబ్ధిదారుని ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. ఆ తర్వాత గ్రామ గోదావరి సమీపాన ఉన్న లక్ష్మీదేవి ఆలయాన్ని ఆయన సందర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.

ఆయన వెంట స్థానిక తహసిల్దార్ జి. బక్కయ్య, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, చింతగూడ సింగల్ విండో చైర్మన్ నాసాని రాజన్న, చింతగూడ సర్పంచ్ సుతారి సుమలత- వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply