పదవ తరగతి మండల టాపర్లకు సన్మానం

పదవ తరగతి మండల టాపర్లకు సన్మానం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరిక్ష ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన సిరిగిరి షాలిని (568) ని, కృష్ణాశ్రీ (517), మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉప్లూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ.. ఉప్లూర్ గ్రామానికి చెందిన సిరిగిరి షాలిని , కృష్ణ శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్లూర్ లో చదివి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 568, మార్కులు, 517 మార్కులు సాధించి కమ్మర్ పల్లి మండల టాపర్ గా నిలవడం చాలా అభినందనీయమని, మన గ్రామానికి గర్వకారణమని అలాగే రానున్న రోజుల్లో ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కురి శేఖర్,కార్యదర్శి నవీన్ గౌడ్,అజయ్,సంతోష్,సురేష్, రాకేష్,రవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply