పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

కేసముద్రం, ఆంధ్రప్రభ : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడు తున్న 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ వేరిపికేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కేసముద్రం ప్రిన్సిపాల్ ఈగ మల్లికార్జున్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు మే 27 నుండి మే31 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు , స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మే 29 నుండి జూన్ 3 వరకు సర్టిఫికేట్ వేరిపికేషన్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ జూన్ 3న నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

జూన్ 6న సీట్ల కేటాయింపు

ఫలితాలు విడుదల చేయబడతాయని, అనంతరం విద్యార్థులు జూన్ 6 నుండి 9 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే జూన్ 8 నుండి 9 వరకు కాలేజీలలో ప్రత్యక్ష రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

తరగతులు జూన్ 15 నుండి ప్రారంభం…

తరగతులు జూన్ 15 నుండి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కేసముద్రం లో హెల్ప్‌లైన్ సెంటర్ / కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల ఎంపిక తదితర అంశాలలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు సాంకేతిక విద్య ద్వారా ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవడానికి పాలిటెక్నిక్ విద్య ఎంతో ఉపయోగకరమని, అర్హులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

షెడ్యూల్ వివరాలు:

ప్రక్రియ తేదీలు ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు మే 27 నుండి 31 వరకు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మే 29 నుండి జూన్ 1 వరకు, వెబ్ ఆప్షన్స్ మే 29 నుండి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ జూన్ 3, సీట్ల కేటాయింపు జూన్ 6 ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 6 నుండి 9 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ జూన్ 8 నుండి 9 వరకు

కౌన్సెలింగ్‌కు తీసుకురావలసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, 1 జిరాక్స్ ప్రతులు:

4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు, పాలిసెట్ హాల్ టికెట్,
పాలిసెట్ ర్యాంక్ కార్డు, SSC మెమో, కుల ధ్రువీకరణ పత్రం (వర్తించిన పక్షంలో),తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించిన పక్షంలో), ఆధార్ కార్డు, ప్రైవేట్‌గా SSC ఉత్తీర్ణులైన విద్యార్థులకు .
చివరి విడుత షెడ్యూల్ ప్రక్రియ తేదీలు ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుః జూన్ 15 , సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 16, వెబ్ ఆప్షన్స్ జూన్ 16 నుండి జూన్ 17 వరకు, వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ జూన్ 17 , సీట్ల కేటాయింపు జూన్ 20 ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 20 నుండి 22 వరకు ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

Leave a Reply