దళిత క్రైస్తవులకు రక్షణ కరువు

దళిత క్రైస్తవులకు రక్షణ కరువు

తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి స్వామిదాసు

తిరువూరు, ఆధ్రప్రభ : రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో పాస్టర్ అభినయ్ దాసన్పై హత్యాయత్నం వంటి సంఘటనలతో దళిత క్రైస్తవుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాస్టర్లపై దాడులు పెరిగిపోయాయని, ఈ దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు రాజ్యాంగానికి కట్టుబడి మాట్లాడాల్సి ఉండగా మతవిద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వ్యక్తిగత అభిప్రాయాలు బహిర్గతం చేయడం తగదన్నారు. దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టే విధంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉపసభాపతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ తిరువూరు పట్టణ అధ్యక్షుడు రేగళ్ళ మోహన్రెడ్డి, బీసీ సెల్ నాయకుడు. పరసా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply