మొక్కజొన్న బస్తాలు గోదాంలకు తరలింపు

మొక్కజొన్న బస్తాలు గోదాంలకు తరలింపు
కొత్తగూడ, ఆంధ్రప్రభ:
కంటా అయినా మొక్కజొన్న బస్తాలను గూడూరు మండలం లోని పిఎసిఎస్ గోదాం కు తరలిస్తున్నట్లు ఎంపీడీఓ మీర్జా మున్వర్ బేగ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం లోని మక్కల కొనుగోలు కేంద్రం లో కంటా అయి నిల్వ ఉన్న బస్తాలను 30 ట్రాక్టర్ లతో పాటుగా నాలుగు లారీ లలో లోడు చేసి పంపించినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేయట్టినట్లు స్థానిక ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయిలో మక్కల కొనుగోలు జరుగుతుందని రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. వారి వెంట ఎఇఓ రాజు, పంచాయతీ కార్యదర్శి దివాకర్, సెంటర్ ఇంచార్జ్ చతృ తదితరులు పాల్గొన్నారు.
