16 points | పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం

16 points | పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం
16 points | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయఢంకా మోగించింది. ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తూ.. లీగ్ దశలోనే అద్భుత ప్రదర్శనతో అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను నమోదు చేసిన ఆర్‌సీబీ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్లలో ఒకటిగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడికి లోనైంది. కేవలం 93 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ క్లిష్ట సమయంలో శశాంక్ (56 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (37 పరుగులు) జట్టును గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ ఉత్కంఠగా సాగినప్పటికీ, చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు తడబడటంతో ఓటమి తప్పలేదు.
