రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరిపెడ, ఆంధ్రప్రభ : మండలం లోని తానంచెర్ల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కొప్పోలు గ్రామానికి చెందిన పర్వతం నరేష్ మరిపెడలో ఫర్నిచర్ షాపులో పని చేసి తిరిగి తన బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తానంచెర్ల వద్ద వెనుక నుండి బస్సు వస్తుంది.
ఈ క్రమంలో మొక్కజొన్న పొట్టు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డు దాటబోయింది. దీంతో నరేష్ బైక్ వేగంగా ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
