మక్కలు దిగుమతి కోసం మిల్లు ఎదుట రైతుల ధర్నా,

మక్కలు దిగుమతి కోసం మిల్లు ఎదుట రైతుల ధర్నా,
స్తంభించిన రాకపోకలు,
పోలీసుల జోక్యంతో శాంతించిన రైతులు,

చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవిలో రైతులు పండించిన మొక్కజొన్నలు దిగుమతి చేసుకోవాలని మండలంలోని శాంతినగర్ శివారులోఉన్న అంజనేయ ఆగ్రో పత్తి మిల్లు గోదాం ఎదుట గురువారం రైతులు ధర్నా రాస్తారోకోతో నిరసన తెలిపారు. చిట్యాల టేకుమట్ల ,మొగులపల్లి, మండలాల్లో రైతులు పండించిన మక్కలు ఆయా సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు ,కేంద్రాల అనుమతి పత్రాలతో ట్రాక్టర్లలో గోదాంకు చేరుకుగా సంబంధిత నిర్వాహకులు, ఇక్కడ దిగుమతి లేదు, గోదాం నిండిపోయింది. జమ్మికుంటకు వెళ్లాలని రైతులను ఆదేశించినట్లు తెలిపారు .
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రధాన రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తమ సిబ్బందితో మిల్లు వద్దకు చేరుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి, రైతుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కోరారు, దీంతో రైతులను శాంతింప చేసి ధర్నా విరమింప చేశారు.

