నలుగురు కలప స్మగ్లర్ల అరెస్టు..

నలుగురు కలప స్మగ్లర్ల అరెస్టు..

  • జడ్జి 14 రోజుల రిమాండ్..
  • ఆదిలాబాద్ జైలుకు తరలింపు..

జన్నారం, ఆంధ్రప్రభ : కలప అక్రమ రవాణాకు పాల్పడ్డ నలుగురు స్మగ్లర్లను డాగ్ స్క్వాడ్ గుర్తించగా, అధికారులు అరెస్టు చేసి లక్షేటిపేట కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ జైలుకు పంపించారు.మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని చింతగూడ ఫారెస్ట్ బీట్ అడవుల్లో అక్రమ టేకు చెట్ల నరికివేత కేసులో బొమ్మెనకు చెందిన సట్ల రాజన్న,కొమిరె రాజం, ఆరె పోషం,మైనేని సురేష్ లను విశ్వసనీయ సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎల్.అనిల్ నాయక్,చింతగూడ ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు బి.భోజానాయక్, కృష్ణారావు,జి.వెంకటేష్, శ్రీకాంత్ లు నేరస్థులను ఈ నెల 12న పట్టుకున్నారని జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం తెలిపారు.ఆ కలప స్మగ్లర్లు రాత్రి వేళల్లో అడవిలోకి ప్రవేశించి టేకు చెట్లను అక్రమంగా నరికి దుంగలుగా తయారుచేసి విక్రయించినట్లు ఒప్పుకున్నారని ఆయన చెప్పారు.సట్ల రాజన్న, కొమిరె రాజం లపై గతంలో కూడా పలు అటవీ నేర కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైదన్నారు.ఆ స్మగ్లర్లను లక్షేట్టిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించగా ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు ఆయన వివరించారు.

Leave a Reply