బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి

బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి
- కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలి
- సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ రాజకీయ ఒత్తిడికి పోలీసులు లొంగి అరెస్టు చేయడం లేదని, వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న మంత్రి బండి సంజయ్ చట్టంపై గౌరవం ఉంచి తన కొడుకును అప్పగించాలని డిమాండ్ చేశారు. పైగా మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడడాన్ని చూస్తే కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.సాయిలు, మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
