ఆదర్శ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

ఆదర్శ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
- చిట్యాల ప్రిన్సిపాల్ మేకల రమేష్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోనీ ఆదర్శ పాఠశాల, కళాశాలలో, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ప్రిన్సిపాల్ మేకల రమేష్ గురువారం తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న విద్యార్థిని ,విద్యార్థులు అలాగే సుదూర ప్రాంతం విద్యార్థిని విద్యార్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కళాశాలలో ఉదయం8 నుండి 12 గంటల లోపు తగిన ధ్రువ పత్రాలతో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. బాలికలకు ప్రత్యేకమైన హాస్టల్స్ సౌకర్యం కలదని, ఈ అవకాశాన్ని విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ లో చివరిగా ఈ నెల 25 కు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు tgms. Telangana. Gov. In వెబ్సైట్లు సంప్రదించాలని ప్రిన్సిపాల్ రమేష్ కోరారు.
