700 vehicles | ఆదిలాబాద్ మార్కెట్‌లో జొన్నరైతు ఆగమాగం

700 vehicles | ఆదిలాబాద్ మార్కెట్‌లో జొన్నరైతు ఆగమాగం

నాలుగు రోజులుగా నిలిచిన కొనుగోళ్లు
గోడౌన్ల కొరత, ధాన్యం తరలింపులో జాప్యమే కార‌ణం
షెడ్యూల్ వారీగా కొనుగోళ్లు చేస్తామన్న కలెక్టర్

700 vehicles | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది.. జొన్న రైతుల పరిస్థితి. యాసంగిలో ఈసారి ఆశాజనకంగా జొన్న దిగుబడి రాగా పంట నిల్వ చేసుకునేందుకు స్థలం లేక, మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోలు లో జాప్యం కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గోడౌన్ల కొరత, ధాన్యం తరలింపులో జాప్యం కారణంగా నాలుగు రోజులపాటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు నిలిపివేశారు. తిరిగి గురువారం నుండి జొన్న కొనుగోలు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పడంతో బుధవారం రాత్రి వరకు మార్కెట్ యార్డ్ కు సుమారు 700 లకు పైగా వాహనాల్లో రైతులు జొన్న పంటను తీసుకొచ్చారు. అయితే షెడ్యూల్ ప్రకారం లేకుండానే వందలాది మంది రైతులు జొన్న పంటను అమ్ముకునేందుకు రావడంతో అధికారులు బిత్తర పోయారు. మార్కెట్ యార్డులో ఇదివరకే నిల్వ ఉన్న శనగలు, మక్కలు తరలింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో తాజాగా వచ్చిన వేలాది క్వింటాళ్ల జొన్నలు నిలువ సామర్థ్యం లేక బైల్ బజార్ ప్రదేశానికి తరలించారు. గత ఐదు రోజులుగా మార్కెట్ యార్డులోనే పంటను ఆరబెట్టుకుంటూ అష్ట కష్టాలు పడుతున్న రైతులకు పంట కొనుగోలు జాప్యం ఆందోళన కలిగిస్తోంది.

700 vehicles | అకాల వర్షంతో అన్నదాత కుదేలు

గురువారం రాత్రి అకాల వర్షం, గాలివాన దుమారం జొన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మార్కెట్ యార్డ్ కు పోటెత్తిన జొన్న ధాన్యం అక్కడక్కడ తడిచిపోవడంతో దాన్ని కాపాడుకునేందుకు తెల్లవారుజాము వరకు రైతులు అపసోపాలు పడ్డారు. ఎండకు ఎండ పెడుతూ అకాల వర్షాలకు పంట ధాన్యం తడిసిపోయి రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది. మార్కెట్ యార్డులో గన్ని సంచుల కొరత, పంటను కప్పుకోవడానికి టార్పాలిన్ కవరు లేక రైతులు దైన్యస్థితిని ఎదుర్కొన్నారు. పద్ధతి ప్రకారం టోకెన్ లేకుండానే రావడం వల్లే కొనుగోళ్లకు జాప్యం జరుగుతుందని అధికారులు చెప్పారు.

700 vehicles | షెడ్యూల్ ప్రకారమే కొనుగోళ్లు చేస్తాం

జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామాల వారీగా అధికారులు రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే రైతులు జొన్నలు అమ్మకానికి తీసుకురావాలి. మండల వ్యవసాయ అధికారి నుండి టోకెన్ తీసుకొని వస్తేనే మార్కెట్లోనికి అనుమతించి పంటను కొనుగోలు చేస్తామని అన్నారు. షెడ్యూల్ లేకుండా రైతులు పంటను తీసుకువచ్చి ఇబ్బందులకు గురికా వద్దన్నారు. ఇప్పటికే అదిలాబాద్ జిల్లాలో జొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతమైందని, మార్కెట్ యార్డుల్లో గన్ని సంచుల కొరత, వాహనాల రవాణా, గోడౌన్ల కొరత క్రమంగా తీరిపోతోందని కలెక్టర్ వివరించారు. మధ్య దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.

CLICK HERE TO READ MOE : ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

CLICK HERE TO READ MOE

Leave a Reply