వేడుకగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

వేడుకగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపొర్లలో మంత్రి వాకిటిశ్రీహరి ఆదేశాల మేరకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు వేడుకగా కొనసాగాయి. చిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నిఖితప్రశాంత్, ఎంపీడీవో కిషోర్ కుమార్ ఇందిరమ్మ గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గూడు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకోవాలని అన్నారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తే అర్హులైన పేదవారికి ఇండ్లు మంజూరు చేస్తారని అన్నారు. గ్రామానికి చెందిన లలితమ్మ, అనిత గృహప్రవేశాలు చేసి చీర సరేఅందజేసినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇల్లు నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులుచెల్లిస్తుందని అన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎండిరఫీ, జిపిఓరేణుక , ఏఎన్ఎం దేవికారాణి, కాంగ్రెస్ నాయకుడు గువ్వలిరాజుతదితరులు పాల్గొన్నారు.
