ఘనంగా మంత్రి పయ్యావుల దినోత్సవం వేడుకలు

ఘనంగా మంత్రి పయ్యావుల దినోత్సవం వేడుకలు
10వ తరగతి పరీక్షలలో అధిక మార్పులు
సాధించి సత్తా చాటిన విద్యార్థులకు నగదు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు వస్తదానం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 62వ జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మండలం లోని వివిధ గ్రామాలలో టిడిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మంత్రి పయ్యావుల కేశవ్ పుట్టినరోజును పెద్దఎత్తున జరుపుకున్నారు. ఉరవకొండ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనుండి అనంతపురం బైపాస్, కనేకల్ క్రాస్, గాంధీ చౌక్, సుబ్రహ్మ ణ్యం గుడి, కెనరా బ్యాంక్, టవర్ క్లాక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు 260 మందికి వస్త్ర దానం చేశారు.
10వ తరగతి పరీక్షలలో అధిక మార్కులు సాధించి సత్తా చాటిన 16 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు నగదును అందజేశారు. మండలంలో టాపర్ గా నిలిచిన చిన ఉరవకొండ ఎస్.కె ప్రభుత్వ హైస్కూల్ కు చెందిన నక్షత్రకు 10 వేల రూపాయలను అందజేశారు. టవర్ క్లాక్ వద్ద భారీ కేక్ కట్ చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి ప్రసాద్, ఎంఈవో ఈశ్వరప్ప, తహసిల్దార్ భోగన్న గౌడ్, సీఐ మహానంది, ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయభాస్కర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవినేని పురుషోత్తం, ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప, పెన్నాహోబిలం ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ సింగల్ విండో సహకార సంఘం అధ్యక్షులు ప్యారం కేశవానంద, మాజీ సర్పంచులు ఇంద్రావతి ఎర్రగుంట్ల వెంకటేశులు, మోపిడి మాజీ సర్పంచ్ గోవిందు, బూదగవి మాజీ సర్పంచ్ చత్రగుడి చిరంజీవి, మాజీ ఎంపీపీలు కుళ్లాయప్ప సుంకరత్నమ్మ, నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి గుర్రం సుధాకర్, పెద్ద కొట్టాలపల్లి మాజీ సర్పంచ్ గొర్తి రంగనాయకులు టిడిపి నాయకులు బోస్, కట్టుబడి ఖలందర్, దండా కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సుంకన్న, రఘు రాములు, వన్నారెడ్డి, మాజీ వార్డు సభ్యులు మీనుగ రామాంజనేయులు, పెద్ద ముష్టూర్ మీనుగ రామకృష్ణ, ఇంద్రావతి సుధాకర్, వరప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
