ఏసీఏ ఆధ్వర్యంలో వికెట్‌కీపింగ్ ప్రత్యేక శిక్షణ శిబిరం

ఏసీఏ ఆధ్వర్యంలో వికెట్‌కీపింగ్ ప్రత్యేక శిక్షణ శిబిరం

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఏసీఏ నార్త్ జోన్ అకాడమీలో వికెట్‌కీపర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. భారత మాజీ వికెట్‌కీపర్ కిరణ్ మోర్ ఈ శిక్షణ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించారు.

కిరణ్ మోర్ ఉదయం 9 గంటలకు అకాడమీకి చేరుకుని తన అంతర్జాతీయ క్రికెట్ అనుభవాలను యువ ఆటగాళ్లతో పంచుకున్నారు. వికెట్‌కీపింగ్‌లో మెళకువలు, మ్యాచ్ పరిస్థితుల్లో అప్రమత్తత, ఫిట్‌నెస్, గ్లౌవ్ వర్క్ వంటి అంశాలపై ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు.

రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ఏసీఏ ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఏసీఏ అధ్యక్షుడు కేసినేని చిన్ని, కార్యదర్శి సాన సతీష్ బాబు కిరణ్ మోర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం అమూల్యమని కొనియాడారు.

యువ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర క్రికెట్ ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు.

శిక్షణలో పాల్గొన్న వికెట్‌కీపర్లు

సీనియర్ మెన్:

రిక్కీ భుయ్
యూఎంఎస్ గిరినాథ్
రేవంత్ రెడ్డి

అండర్-23:

ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్
టీ సాయి
ఎం.కే దత్తా రెడ్డి
పి. పాండురంగరాజు

అండర్-19:

లోహిత్ లక్ష్మీనారాయణ
వీఎంవీఎస్ రక్షన్
హృతిక్ వర్మ

అండర్-16:

హేమంత్ కుమార్ రాయల్
చెరిష్ వర్ధన్
రిషి కుమార్ రెడ్డి

Leave a Reply