ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి…

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి…
అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నాం అంటున్న వ్యాపారులు….
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో వివిధ లైసెన్సులకు బహిరంగ వేలము జరిగి హెచ్చుగా పాడిన పాటదారులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని పాట దారులు వాపోతున్నారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పాటదారుల ద్వారానే వస్తున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వివిధ లైసెన్సుల ద్వారా దేవస్థానానికి కోటి రూపాయలు పైగా ఆదాయం సమకూరింది.
కానీ కొందరు స్వార్థంతో పాటదారులు సిండికేట్ అయ్యి దేవస్థానం ఆదాయం తగ్గింది అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే దేవస్థానం ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులు చొచ్చుకొని వచ్చి పాటదారులను బెదిరించి వచ్చిన భక్తులను తప్పుదోవ పట్టించి వారి ప్రైవేట్ రూములకు ప్రైవేట్ తోటలకు తీసుకొని వెళుతున్నారు. దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానానికి కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు వ్యక్తులు తీసుకొని వెళుతున్న దేవస్థానం వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
దేవస్థానం వారికి పైకం చెల్లించినప్పటికీ డిపాజిట్ల రూపంలో కట్టిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం పైకం కట్టాలని పాటదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే మునేటి అవతల ఉన్న మామిడి తోటలో కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన పాపమాంబ వనము కళ్యాణ మండపం మొత్తం జలమయం అవుతుంది. ఇది ఆరిపోవటానికి కనీసం పది రోజులు సమయం పడుతుంది . ఆ సమయంలో పాపమాంబ వనములో భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు.
దీనివలన వచ్చిన భక్తులు ప్రైవేట్ తోటలకు వెళ్లిపోతున్నారు. ఇలా దేవస్థానం ఆవరణలో దేవస్థానం చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు రూములు వారు మునేరులో అక్రమంగా నిర్వహిస్తున్న పాకల వాళ్ళు ప్రైవేట్ తోటల వాళ్లు ఎవరికివారు దేవస్థానం నకు విచ్చేసిన భక్తులనే టార్గెట్ గా చేసుకొని దేవస్థానం ఆవరణలో తమ వ్యాపారాలు కొనసాగించకుండా దేవస్థానానికి ఉచితంగా పైకము చెల్లించే పరిస్థితి ఏర్పడిందని పాట దారులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు వేలంపాటల సమయంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
