ఎల్లంపేట మున్సిపాలిటీలో ఘనంగా ‘విద్య వారోత్సవాలు’…

ఎల్లంపేట మున్సిపాలిటీలో ఘనంగా ‘విద్య వారోత్సవాలు’…

ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) విజయకుమారి…

​మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ బడులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ‘విద్య వారోత్సవాలు’ బుధవారం రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) విజయకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ బోధనను అందిస్తున్నట్లు తెలిపారు. ​”ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వినియోగించుకోవాలి అని తెలిపారు.. ప్రజా ప్రతినిధులు పాఠశాలను పట్టించుకోని మౌలిక సదుపాయాల కల్పనలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు సమాజం ఒక మంచి పాఠశాలలు తయారు చేస్తే పాఠశాల ఒక మంచి సమాజాన్ని ఇస్తుందని చెప్పారు… మునిసిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన అనివార్యం అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల కొరతను అధికారులు తీర్చాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల విద్యాధికారి వై శంకరయ్య, కౌన్సిలర్లు ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎం ఆర్ సి సిబ్బంది మల్లేష్ స్థానిక మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply