ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
రాప్తాడు, ఆంధ్రప్రభ : శ్రీ హనుమంతుని జన్మదినం శుభ సంధర్భంగా రాప్తాడు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఆయా గ్రామాల భక్తాదులు ప్రజలు పూజారులతో ప్రత్యేక పూజలు చేయించారు.పూలహారాలతో తులసి మాలలు ఆకు పూజలతో శ్రీ హనుమంతుని ప్రత్యేకంగా అలంకరించి జై హనుమాన్ అనే నినాదంతో పూజలు చేశారు.
భక్తులు ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామ జపం చేశారు.శ్రీ హనుమంతునికి టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్న తర్వాత ఉపవాస దీక్షను ముగించారు.ప్రతి గ్రామంలోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.శ్రీ హనుమంతుని తలుచుకున్న ప్రతిసారి ధైర్యం బలం పెరుగుతుందని పూజారులు భక్తులకు తెలియజేశారు.
