రైతులకు గన్ని బ్యాగుల సరఫరా చేయాలి..
రైతులకు గన్ని బ్యాగుల సరఫరా చేయాలి..
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలి
తరుగు పేరుతో అదనపు తూకాలను ఆపాలి
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
అన్ని పంటలకు బోనస్ స్ ఇవ్వాలి
నాగర్ కర్నూల్ ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం సమస్యల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 4 నుండి మక్కలకొనుగోలు చేస్తున్న గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని అనేక చోట్ల రైతులు ప్రైవేట్ లో గన్ని బ్యాగులు కొనుక్కొని వస్తున్నారని సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని గన్ని బ్యాగుల కొరతను నివారించడం కోసం ఏమాత్రం అధికారులు ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. మార్కెట్లో కొనుగోలు తీసిన గన్ని బ్యాగులకు రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యం లారీల కొరత వల్ల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల దగ్గరనే ఉండడంవల్ల రైతులు బస్తాల కాపలా ఉండి పడి కాపులు కావాల్సి వస్తుందని అకాల వర్షాలు వస్తే దాన్యం మొత్తం తడిసి పోతుందని రైతులకు ట్రాక్టర్ల ద్వారా సరఫరాకు అవకాశం కల్పించాలని రవాణా చార్జీలు చెల్లించాలని అదేవిధంగా తరలిస్తే మళ్లీ ధాన్య సేకరణ చేపట్టడానికి వీలవుతుందని తెలిపారు. తరుగు పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కిలో 300 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు అదనంగా తూకం వేస్తున్నారు దీని ద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుందని వెంటనే తరుగు తూకం ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులైన మంచినీళ్లు ఎండలకు టెంట్లు ఏర్పాటు చేయాలని రైతులకు భోజన వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అక్కడ కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు అన్ని పంటలకు బోన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4వ ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల దగ్గర సేకరించిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ చింత ఆంజనేయులు బి ఆంజనేయులు జిల్లా నాయకులు ఏం శ్రీనివాస్ నరసింహ నాగరాజు శివ వర్మ అశోకు బాల్రెడ్డి మధు పరశురాములు సైదులు శివ తారా సింగ్ కృష్ణారెడ్డి తిరుపతిరెడ్డి మల్లారెడ్డి కాశన్న సురేష్ శివ ప్రచండ తదితరులు పాల్గొన్నారు

