Megastar | అసలు నిజం ఇదే..
Megastar | అసలు నిజం ఇదే..
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే నిర్ణయం
విశ్వంభర రెండు పార్టులా..? దర్శకుడి క్లారిటీ
జులై 10న రిలీజ్‌కు ప్లానింగ్..?
Megastar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ భారీ చిత్రాన్ని మల్లిడి వశిష్ట్ తెరకెక్కించారు. అయితే.. ఎప్పుడో రావాల్సిన విశ్వంభర ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. దీంతో ఎప్పుడెప్పుడు విశ్వంభర గురించి అప్ డేట్ ఇస్తారా…? అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. విశ్వంభర మూవీ రెండు పార్టులుగా రానుందనే కొత్త వార్త బయటకు వచ్చింది. ఇది నిజమా..? లేక గాసిప్పా..?
కాంప్రమైజ్ కాకూడదనే..
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ కావడంతో.. విశ్వంభర మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చిరుకు జంటగా త్రిష నటిస్తుంది. అయితే.. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కారణం ఏంటంటే.. ఆమధ్య రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ కు నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఏమాత్రం బాలేదనే టాక్ వచ్చింది. ఇక అక్కడ నుంచి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతో మళ్లీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.

విశ్వంభర ఒక పార్టే..
అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ.. సంతృప్తి చెందేలా అవుట్ ఫుట్ రాకపోవడంతో మళ్లీ మళ్లీ వర్క్ చేస్తున్నారు. అందుకనే.. విశ్వంభర రావడం ఇంత ఆలస్యం అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా విశ్వంభర మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారనే ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో.. ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతుంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ స్పందించారు. విశ్వంభర రెండు పార్టులుగా చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తకు.. అవునా..? నిజమా..? అంటూ స్పందించారు డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. దీనిని బట్టి.. విశ్వంభర రెండు పార్టులుగా రావడం లేదు.. ఒక పార్టుగానే రాబోతుందని క్లారిటీ వచ్చింది.

జులై 10న విశ్వంభర..?
ఇంతకీ.. ఎప్పుడు విశ్వంభర వచ్చేది అంటే.. జులై 10న ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందింస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను హనుమాన్ ఫేమ్ గౌరహరిని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తుంది. మరి.. మన శంకర్ వర ప్రసాద్ గారు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ విశ్వంభర మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.


