Appikatla Gambling Den : అప్పికట్లలో కసినో గుట్టురట్టు Andhra Prabha News
Appikatla Gambling Den : అప్పికట్లలో కసినో గుట్టురట్టు Andhra Prabha News
- కీలక సమాచారంతో పోలీసులు మెరుపుదాడి
- అప్పటికే కొందరు పరారీ
- ఆరుగురు జూదరుల పట్టివేత
- గుడివాడ పల్లెల్లో … పేకాట శిబిరాలపై పోలీసుల డేగకన్ను
పెదపారుపూడి – ఆంధ్రప్రభ
Appikatla Gambling Den : కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసు అధికారి డి.సుభాషిణి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలిలో 12,900 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు అప్పికట్ల గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారని తెలుసుకుని పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఘటనా స్థలంలో పేకాటకు ఉపయోగించిన పేకముక్కలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఆరుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట, ఇతర జూద క్రీడలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు
