ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన..
ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మోదీ పర్యటనలో భాగంగా నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చాలారోజుల తర్వాత ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఇక్కడ రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేయనున్నారని పేర్కొన్నారు. వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కు ప్రారంభోత్సవం. జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతానికి ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 200 కోట్లతో అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులా మారుతుందన్నారు. మూడేళ్ల క్రితమే ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం అనుమతించిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. 2014 వరకూ 2400 కి.మీ. హైవేలు ఉంటే.. ఈ 11 ఏళ్లలో 2,600 కి.మీ. హైవేలు అభివృద్ధి చేసుకున్నాం. అని తెలిపారు.
