Revanthreddy | తెలంగాణను నెంబ‌ర్‌వ‌న్ చేయ‌డ‌మే ల‌క్ష్యం..

Revanthreddy | తెలంగాణను నెంబ‌ర్‌వ‌న్ చేయ‌డ‌మే ల‌క్ష్యం..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ అభివృద్ధికి మోదీ స‌హ‌కారం కావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్ చేయ‌డ‌మే మా ల‌క్ష్యం. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల అయిపోయాయి. రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి అభివృద్ధిపై అంద‌రం దృష్టిపెట్టాల‌ని రేవంత్ అన్నారు. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యం నెరవేరాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాల‌న్నారు. ప్ర‌ధాని మోదీపై తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని రేవంత్ అన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీ చేయ‌డ‌మే ల‌క్ష్యం అని పేర్కొన్నారు. అందుకే మోదీ స‌హ‌కారం కావాల‌న్నారు. మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోదీకి ఎంతో స‌హ‌క‌రించార‌ని గుర్తు చేశారు.

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం న‌రేంద్ర మోదీ చేరుకున్నారు. బేగంపేట నుంచి మోదీ రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి చేరుకున్నారు. అక్క‌డ సీఎం రేవంత్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లు మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మోదీని సీఎం రేవంత్‌రెడ్డి సత్కరించారు. మోదీకి సీఎం వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు.

Leave a Reply